ఇంటర్నెట్ అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది.

ఇంటర్నెట్ గురించి మీకు తెలియని విషయాలు.

మనం ఒక రోజు తిండి లేకపోయినా బ్రతకగలము కానీ ఒక రోజు ఇంటర్నెట్ లేకపోతే బ్రతకలేము. ప్రస్తుతం 10 లక్షల కామెంట్లు 5 లక్షల ఫోటోలు 10 కోట్ల మెస్సేజ్ లు ఇంటర్నెట్ ద్వారా పంపబడుతున్నాయి. యూట్యూబ్ లో ప్రతి నిమిషానికి 10 కోట్ల వ్యూస్ వస్తున్నాయి.గూగుల్ లో ప్రతి నిమిషానికి 10 మిలియన్ ల సెర్చ్ లు నమోదు అవుతున్నాయి. వాట్సాప్ లో ప్రతి నిమిషానికి 8 కోట్ల మెసేజ్ లు పంపబడుతున్నాయి. వీటన్నింటి బట్టి చూస్తే ఇంటర్నెట్ ఎంత పెద్దదో మీరు గమనించవచ్చు. ఒకప్పుడు అవసరంగా ఉండే ఇంటర్నెట్ ఇపుడు అలవాటుగా మారింది. ఇలాంటి ఇంటర్నెట్ ఎలా పని చేస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.

ఎక్కడో వేరే దేశం లో ఉన్న వ్యక్తి పంపిన మెసేజ్ కొన్ని క్షణాల్లో కొన్ని వేల కిలోమీటర్ లో ఉన్న వ్యక్తి కి ఎలా ఆ మెసేజ్ చేరుతుంది. అవతలి వ్యక్తి కి మనకి ఉన్న లింక్ ఏంటి. అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది. ఇంటర్నెట్ గురించి మనం చెల్లించే డబ్బులు ఎక్కడికి వెళ్తాయి. అసలు ఇంటర్నెట్ కి ఓనర్ ఎవరు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ ఆర్టికల్.

1960 లో కంప్యూటర్ లు చాల పెద్దవిగా ఉండేవి. ఇప్పుడున్న కంప్యూటర్ల లాగా ఒకేసారి ఎక్కువ పనులు చేసేవి కావు. కావున దీని వల్ల చాలా సమయం వృధా అయ్యేది. ఇలా సమయం వృధా కాకుండా కంప్యూటర్ లు మాట్లాడుకునే విధంగా 1969 వ సంవత్సరం లో ఒక చిన్న నెట్వర్క్ ని కనుగొన్నారు. దాని పేరు ఆర్పా నెట్ (అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ) ఈ నెట్వర్క్ ద్వారా ఒక కంప్యూటర్ నుండి ఇంకొక కంప్యూటర్ కి లాగ్ ఇన్ అనే పదాన్ని మెసేజ్ గా పంపించారు. కానీ లాగ్ అనే ఒకే పదం ట్రాన్స్ఫర్ అయింది.

ఆ తర్వాత ఇంటర్నెట్ లో ఎన్నో మార్పులు జరిగాయి. 1971 లో టామ్లిసన్ అనే వ్యక్తి ఆర్పనెట్ ద్వారా మొట్టమొదటి ఈమెయిల్ ని పంపించాడు. ఆ తర్వాత వింటన్ క్రిష్ అనే వ్యక్తి టీసీపీ /ఐపీ ని కనుగొన్నాడు. దీని వల్ల ఒక కంప్యూటర్ నుండి ఇంకో కంప్యూటర్ కి మెసేజ్ పంపించడం సులభం అయింది. ఈ పద్దతిలో ఇంటర్నెట్ మరియు ఫోన్ ని ఒకే సమయంలో ఉపయోగించడం కుదరలేదు. ఆ తర్వాత ఇంటర్నెట్ ని మరింత అప్డేట్ చేసారు. 1991 వ సంవత్సరం లో టిమ్ బెర్నెర్స్ లీ అనే వ్యక్తి వరల్డ్ వైడ్ వెబ్(www) ని కనుగొన్నాడు.

ఒక డివైస్ ఇంకొక డివైస్ కి కనెక్ట్ అయి ఉంటె దానిని ఇంటర్నెట్ అంటాము. మన భాషలో చెప్పాలంటే ఇంటర్నెట్ అనేది ఒక వైర్. ఉదాహరణకి మీ ఇంట్లో ఉన్న కంప్యూటర్ ని మీ ఆఫీస్ లో ఉన్న కంప్యూటర్ కి కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తే అదే ఇంటర్నెట్.

కానీ మీరు తయారుచేసిన ఈ కనెక్షన్ మీ రెండు కంప్యూటర్ల లో ఉన్న డేటా మాత్రమే కనిపిస్తుంది. మీ కంప్యూటర్ ని ఇంకో కంప్యూటర్ ని కనెక్ట్ చేయాలంటే మళ్ళీ మీరు ఇంకో కేబుల్ తో కనెక్ట్ చేయాలి. ఇదేవిధంగా ప్రపంచం లో ఉన్న అన్ని కంప్యూటర్స్ ని మీ కంప్యూటర్ తో కనెక్ట్ చేయాలి అంటే మీరు మీ కంప్యూటర్ ని అన్ని కంప్యూటర్స్ తో కలుపుతూ కేబుల్స్ వేయాలి. లేదా అప్పటికే వేసిన కేబుల్ ద్వారా మీరు కనెక్ట్ అయి ఉండాలి.

మీరు అందరూ ఇంటర్నెట్ శాటిలైట్ ద్వారానో లేదంటే క్లౌడ్ సర్వీస్ ద్వారానో పని చేస్తుంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ప్రపంచం లోని 99 % డేటా ట్రాఫిక్ ఈ కేబుల్స్ ద్వారానే ఎక్స్చేంజ్ అవుతాయి. మిగిలిన ఒక శాతం మాత్రమే శాటిలైట్ ద్వారా నడుస్తుంది. ఆ ఒక్క శాతం ఎందుకంటే కొన్ని సెక్యూర్ వెబ్ సైట్ మరియు జీపీఎస్ గూగుల్ మాప్స్ వంటికి మాత్రమే. ఈ ఇంటర్నెట్ కేబుల్ ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్నారు. వీటినే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా సబ్మిరీన్ కేబుల్ అంటారు. ఈ కేబుల్స్ గ్లాస్ లేదా ఫైబర్ తో చేసి ఉంటాయి. వీటి సైజు మన వెంట్రుకల కన్నా కొన్ని వందల రేట్లు చిన్నవిగా ఉంటాయి. మనం పంపే ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఈ సన్నని కేబుల్స్ ద్వారా మాత్రమే వెలుతాయి.

ఇపుడు మీరు చదివే ఈ ఆర్టికల్ కూడా అలాంటి ఏదో ఒక కేబుల్ నుండి వస్తుంది. మీరు ఇంటర్నెట్ ని కంప్యూటర్ లో కాకుండా మొబైల్స్ లోను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మీ మొబైల్ కి వచ్చే సిగ్నల్ దగ్గరలో ఉన్న ఏదో ఒక టవర్ నుండి వస్తుంది. ఏ టవర్ కూడా ఇలాంటి కొన్ని కేబుల్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇలాంటి కొన్ని వందల కేబుల్స్ ని ఒక దగ్గర చేర్చి వాటికీ ప్లాస్టిక్ కోటింగ్ వేసి ఇంటర్నెట్ కోసం వాడుతున్నారు. వీటిలో ఉండే ఒక్కో కేబుల్ ఒకేసారి 25000 కాల్స్ ని హ్యాండిల్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది.

మీకు వచ్చిన డౌట్ ఏంటి అంటే ఈ కేబుల్స్ ఎలా పని చేస్తాయి. ఈ కేబుల్స్ మీరు వాడిన ఏ డివైస్ అయినా యూనిక్ ఐపీ నెంబర్ కలిగి ఉంటాయి. మీ డివైస్ నుండి పంపిన సమాచారం ముక్కలుగ విడిపోతాయి. వీటినే ప్యాకేజ్ అంటారు. అలా విడిపోయిన ప్యాకేజ్ ఈ కేబుల్ ద్వారా కాంతి స్పీడుతో అవతలి డివైస్ కి చేరుకోగానే మళ్ళీ ఏ ప్యాకేజ్ ని కలుపుతాయి.

ఇపుడు మీకు ఇంటర్నెట్ కేబుల్స్ ద్వారా పని చేస్తుంది అని తెలిసింది. ఏ కేబుల్స్ కూడా ఎలా పని చేస్తుందో తెలిసింది. ఇపుడు మనం అసలైన విషయాన్ని తెలుసుకుందాం.

ఇంటర్నెట్ మనకు వస్తూ వస్తూ వేరు వేరు కంపెనీలను దాటుతూ వస్తుంది. వీటినే టయర్ 1 టయర్ 2 టయర్ 3 కంపెనీలు అంటాము. మీరు ఇపుడు చదివినట్టు మీ కంప్యూటర్ ప్రపంచం లో ఉన్న అన్ని కంప్యూటర్ లను కనెక్ట్ అవ్వాలి అంటే మీ కంప్యూటర్ అన్ని కంప్యూటర్ లను కలిపే ఒక కేబుల్ వేయాలి. కానీ ఇది అంత సులభం కాదు. ఎందుకంటే ఈ కేబుల్స్ చాల ఖర్చు తో కూడుకున్న పని. అందుకే ప్రపంచం లో ఉన్న కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని సంవత్సరాల క్రితం అన్ని దేశాలను కలుపుతూ అన్నీ కేబుల్స్ వేయడం జరిగింది. ఈ కంపెనీలనే మనం టయర్ 1 కంపెనీలు అంటాం. ఏ దేశానికి ఆ దేశం కంపెనీలు ఉన్నాయి. మన ఇండియాలో మాత్రం ఒక్క టాటా కమ్యూనికేషన్ ఒక్కటే టయర్ 1 కంపనీ. ఈ కంపెనీ కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళ సొంత ఖర్చు తో అన్నీ దేశాలను కలుపుతూ కేబుల్స్ వేశారు.

మీరు సబ్మిరీన్ కేబుల్ అనే వెబ్సైటు లో ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్న కేబుల్స్ మనకి కనిపిస్తాయి. ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్న ఈ కేబుల్స్ ద్వారానే 99 % డేటా ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ అవుతుంది.

ఈ కేబుల్స్ తో ఇండియా కూడా ఐదు ల్యాండింగ్ ప్రదేశాలను కలిగి ఉంది. అవి ముంబై,కోచి,త్రివేండం,చెన్నై మరియు పుదుచ్చేరి. మీరు ఇండియాలో చూసే ఏ వీడియో అయినా వీడియో కాల్ అయినా ఆ డేటా ఈ అయిదు ల్యాండింగ్ పాయింట్ల నుండే బయటికి వెళుతుంది. అలాగే మీకు వచ్చే ఏ సమాచారం అయినా వీటి ద్వారానే ఇండియా కి ప్రవేశిస్తుంది.

ఇపుడు మీకు ఒక డౌట్ రావచ్చు. ఏదైనా ప్రమాదం వాళ్ళ ఈ కేబుల్స్ తెగిపోతే లేదా వీటి లైఫ్ ఎక్సపైర్ అయిపోతే ఎలా అని.

నిజానికి ఆ కేబుల్స్ లైఫ్ టైం 25 సంవత్సరాలు. కానీ 25 సంవత్సరాల కంటే ముందే టయర్ 1 కంపెనీ వంటి టాటా కమ్యూనికేషన్ ఈ కేబుల్స్ ని మార్చుతూ ఉంటుంది. ఒక వేళా కేబుల్ తెగిపోయిన బ్యాక్ అప్ కోసం ముందే వేరే కేబుల్స్ ఉంటాయి.

ఇక రిలయన్స్ జియో గురించి చూస్తే ఈ కంపెనీ ఆసియ ఆఫ్రికా యూరోప్ దేశాల మధ్య సొంతంగా సబ్మిరినే కేబుల్ ని వేయడం జరిగింది. ఈ కేబుల్స్ 40 tera bytes ని కలిగి ఉంటాయి. ఒకవేళ మీరు జియో నుండి ఆసియ,ఆఫ్రికా,యూరోప్ కి చెందిన ఏదైనా వెబ్ సైట్ ని విసిట్ చేసిన ఆ ట్రాఫిక్ వీరి కేబుల్ ద్వారానే వెళ్ళటం జరుగుతుంది. ఇందుకు వీరికి ఎలాంటి ఖర్చు ఉండదు. అందుకే ఈ కంపెనీ తక్కువ ఖర్చు తో ఇంటర్నెట్ ని అందిస్తుంది. ఇండియాలో 4g కనెక్షన్ తీసుకరావడానికి జియో దాదాపు 5 సంవత్సరాలు కస్టపడి ఇండియా మొత్తం కేబుల్స్ ని వేయడం జరిగింది.

ఇక టయర్ 2 కంపెనీల విషయానికి వస్తే ఈ కంపెనీలు కొంత జీబీ ఇంటర్నెట్ ని కొని వివిధ ఆఫర్ ల రూపం లో వాళ్ళ టవర్ నుండి మనకి అందిస్తారు. ఇవి ఎయిర్టెల్ మరియు ఐడియా కంపనీలు.
ఇక టయర్ 3 కంపనీల విషయానికి వస్తే ఈ కంపెనీలు టయర్ 2 లకు కొంత మొత్తాన్ని చెల్లించి కొని మనకి అందిస్తారు. ఇవి hathway మరియు tieleona.

ఈ టయర్ 2 మరియు టయర్ 3 కంపెనీలు అన్ని తమ డేటా ని ఒకరినొకరు ట్రాన్స్ఫర్ చేసుకునే విధముగా ఒక కంపెనీని స్థాపించాయి. అదే NIXI ( నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజి ఆఫ్ ఇండియా.) NIXI వెబ్ సైట్ లో ఎంత ట్రాఫిక్ వస్తుందో తెలుసుకోవచ్చు.

మొత్తానికి ఇంటర్నెట్ అనేది ఉచితమే కేవలం కేబుల్స్ కి అయ్యే చార్జీలు మాత్రమే. ఇపుడు మీరు ఏదైనా వెబ్ సైట్ విసిట్ చేస్తే ఆ ట్రాఫిక్ ఏ ప్రదేశాలనుండి వెళుతుందో ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇదండీ ఇంటర్నెట్ కి సంబంధించిన విశేషాలు. మీరు ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలియని విషయాన్నీ తెలుసుకున్నారని ఆశిస్తూ మీ ఆన్ లైన్ బడి.
ధన్యవాదములు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *