Luckiest Person In The World.

ప్రపంచం లో అత్యంత అదృష్టవంతుడు ఎవరో తెలుసుకోండి.

 

మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 2000 రూపాయలు దొరికితేనే మనంత అదృష్టవంతుడు ఎవరు లేరు అని అనుకుంటాము. కానీ పైన ఫోటో లో ఉన్న వ్యక్తి గురించి తెలుసుకుంటే మన అదృష్టం ఎందుకు పనికిరాదు. అతని పేరు ఫ్రాన్ సెలక్ ( frane selak ) ఇతను 1929 లో జన్మించాడు. ఇతనికి సంగీతం పైన ఉన్న ఆసక్తి తో సంగీతం టీచర్ గా పనిచేసారు. ఇతను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు సార్లు భయంకరమైన చావు నుండి తప్పించుకున్నాడు. ఇతని జీవితం అంతా final destination సినిమా లాగా ఉంటుంది.

ఆ ఏడు సంఘటనలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

 

1 . మొదటి సంఘటన 1962 లో రైలు లో పని చేస్తున్నప్పుడు ఆ రైలు పట్టాలు తప్పి లోతుగా ఉన్న నదిలో పడిపోయింది. అదే రైలు లో ఉన్న 17 మంది చనిపోయారు. కానీ ఇతను మాత్రం చిన్న చిన్న గాయాలతో బయట పడ్డాడు.

 

flight accident
2 . రెండవ సంఘటన 1963 లో మొదటి సారి విమానం లో ప్రయాణం చేస్తున్నాడు. ఆ విమానం ఆకాశంలో ఉండగానే పనిచేయటం ఆగిపోయింది , ఆ విమానం కిందకి దూసుకు వస్తూ ఉండగా selak పక్కనే ఉన్న door విరిగిపోయి selak కింద పడ్డాడు. ఆ విమానం కుప్ప కూలి లోపల ఉన్న చాలా మంది ప్రయాణికులు చనిపోయారు. కానీ selak మాత్రం దగ్గరలో ఉన్న గడ్డివాము మీద పడి ఏమి గాయాలు కాకుండా బయట పడ్డాడు.

 

bus accident
3 . మూడవ సంఘటన 1966 లో బస్సు లో ప్రయాణం చేస్తూ ఉండగా బస్సు కి బ్రిడ్జి పై ప్రమాదం జరిగి కింద ఉన్న నదిలో పడిపోయింది. బస్సు లో ఉన్న నలుగురు ప్రయాణికులు చనిపోయారు. కానీ selak మాత్రం చిన్న గాయాలతో బ్రతికి పోయాడు.

 


4 . నాలుగవ సంఘటన 1970 లో అతను తన సొంత కారులో ప్రయాణిస్తున్నాడు. కానీ మధ్యలో పెట్రోల్ ట్యాంక్ నుండి మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన selak కారులో నుంచి దూకాడు. అతడు దూకిన కొన్ని సెకనుల తరువాత కారు పేలిపోయింది. కానీ అతను బ్రతికిపోయాడు.

 

car accidents
5 . ఐదవ సంఘటన 1973 లో కూడా కారు ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా చిన్న చిన్న గాయాలతో బ్రతికిపోయాడు.

 


6 . ఆరవ సంఘటన 1995 లో ఇతను నడుచుకుంటూ వెళ్తుండగా ఒక బస్సు ఇతనిని డీ కొట్టింది. ఇక్కడ కూడా ఇతను బ్రతికిపోయాడు.

 


7 . చివరిగా ఏడవ సంఘటన 1996 లో కారు లో వెళ్తుండగా కారు అదుపుతప్పి 300 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోయింది. అయితే అతను కారు కిందకి పడుతూవుండగా కారు లో నుండి దూకేసి ఒక చెట్టు కొమ్మని పట్టుకున్నాడు. ఆ కారు లోయలో పడి బూడిద అయిపోయింది. కానీ మన selak మాత్రం బయట పడ్డాడు.

ఇలా ఏడు సార్లు చావు నుండి తప్పించుకున్నాడు.
ఇవన్నీటి కంటే అసలైన విషయం ఇంకొకటి ఉంది.

money
అది ఏమిటంటే 2003 లో వచ్చిన లాటరీ తన జీవితాన్నే మార్చేసింది. అతనికి ఆ లాటరీ లో తగిలిన డబ్బు ఎంత అంటే అక్షరాలా ఆరు కోట్లు.
ఇదండీ ఇతని అదృష్టం. ఇతని అదృష్టం తో పోలిస్తే మన అదృష్టం అసలు అదృష్టమేనా ?
అందుకీ ఇతనిని ప్రపంచం లో అదృష్టవంతుడిగా పరిగణిస్తారు.

2 thoughts on “Luckiest Person In The World.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *