Motivational And Inspirational quotes In Telugu

Inspirational And Motivational Stories In Telugu

 

లక్ష్యం వేరు, కోరిక వేరు!
కోరిక తీరాలని పరిగెడితే
తగిలేది ఎదురు దెబ్బలే .
అదే… లక్ష్యం నెరవేరాలని అడుగులు వేస్తే
ఎదురు వచ్చే ప్రతి ఒక్కటి విజయాలే.

రాముడు అంతటి వాడే రావణుకునికి నచ్చలేదు,
కృష్ణుడు అంతటి వాడే కంసుడు కి నచ్చలేదు,
అందరికి నచ్చేటట్లు, అందరూ మెచ్చేటట్లు
మనం ఉండాల్సిన అవసరం లేదు.
ఎవరి జీవితం వారిదే.

దూర దూరంగా నాటిన మొక్కలు
కూడా పెరిగే కొద్దీ దగ్గర అవుతాయి.
కానీ మనుషులు మాత్రం పెరిగే కొద్దీ
దూరం అవుతున్నారు.

బాధలు ఎపుడు ఉండేవే..
వాటిని చూసి బయపడకు.
చిన్న చిరు నవ్వు చిందించు చాలు
దాన్ని చూసి ఆ బాధ కూడా
భయం తో పారిపోతుంది.

మంచితనం అనేది
ఒక మహా వృక్షం లాంటిది..,
ఎవరు ఎంత నరికిన..,
అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది..,
గుండె లోలోతుల్లో నుండి
జీవం పోసుకుంటూనే ఉంటుంది..!!

నువ్వు యుద్ధం
గెలిచే అంతవరకు
ఏ శబ్దం చేయకు.
ఎందుకంటే నీ విజయమే
ప్రపంచానికి
పెద్ద శబ్దమై వినిపిస్తుంది.

ధైర్యం, పట్టుదల, ఆత్మ విశ్వాసం,
ఈ మూడింటితోనే
చాలా మంది సామాన్యులు,
నాయకులు అయ్యారు.

జీవితం అనేది గమ్యం కాదు.. గమనం మాత్రమే..
ఎన్ని సార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది.
గమ్యం అనంతం..గమనం అనేకం.
ఆ.. అనంత గమ్యం వైపు అనేక దిశలుగా కరిగి పోయేదే జీవితం.

ఒక్క నిమిషం లో
జీవితం ఏమి మారదు
కానీ..
ఆ ఒక్క నిమిషం లో
అలోచించి తీసుకున్న
నిర్ణయం జీవితాన్నే
మార్చేస్తుంది…
సాధించడం వీరుడి లక్షణం
దాన్ని త్యాగం చేయడం
గోప్పవాడి లక్షణం!

వేదం చదివితేనే ధర్మం తెలుస్తుంది
వైద్యం చదివితేనే రోగం తెలుస్తుంది
గణితం చదివితేనే లెక్క తెలుస్తుంది
కానీ లోకం చదివితేనే బ్రతకడం తెలుస్తుంది.

లక్ష్యం పైన ఉన్నంత శ్రద్ధ ని
లక్ష్య సాధన లో సైతం చూపించాలి,
ఇదే విజయానికి రహస్యం.

ప్రశ్నించనిదే సమాధానం దొరకదు
ప్రయత్నించనిదే కోరుకున్నది దక్కదు
అడుగు వేయనిదే కాలం కదలనివ్వదు
అందుకే ఆత్మ విశ్వాసం తో
ముందుకు అడుగులు వేయి మిత్రమా..!

మిత్రమా కష్టాలు అనేవి
భయపెట్టనికి రావు
ఎలా బ్రతకాలో
నేర్పడానికి వస్తాయి…

విజయానికి కావలసినది
బోలెడంత సమయం కాదు..
ఉన్న కొద్ది సమయాన్ని
సద్వినియోగం చేసుకోవటమే.

 

అన్నీ కోల్పోయిన ఆత్మ విశ్వాసం కోల్పోకూడదు ,
అది ఒక్కటి ఉంటే చాలు.
మనం కోల్పోయిన వాటినన్నిటిని తిరిగి సంపాదించుకోవచ్చు.

ప్రారంభం కష్టమైతేనే
ముగింపు సుఖమవుతుంది.

పరాజయాలను పట్టించుకోకు
అవి సర్వ సాధారణం
అవే జీవితానికి మెరుగులు దిద్దేది
ఓటములే లేని జీవితం
అసలు ఉండనే ఉండదు.

ఓడిపోయావంటే నీకేది రాదని కాదు
నువ్వు నేర్చుకోవలసినది
ఇంకా చాలా ఉందని అర్ధం.

ఒక పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమల్ని తింటుంది. ఆ పక్షి చనిపోయినప్పుడు దానిని చీమలు తింటాయి. కాలం, పరిస్థితులు ఏ క్షణంలో ఐన తారుమారు అవుతాయి. జీవితం లో ఎవర్ని తగ్గించి మాట్లాడకూడదు. ఎవర్ని భాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు. కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గి పుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయటానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనం తో ఉండాలి. మంచి మనసుతో ఆలోచించాలి.

One thought on “Motivational And Inspirational quotes In Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *