భారతదేశం లో భారతీయులకి అనుమతి లేని కొన్ని ప్రదేశాలు.

భారతదేశంలో భారతీయులకి ప్రవేశం లేని ప్రదేశాలు

మన ఇండియాలో మన ఇండియా వాళ్ళచే కట్టబడిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. కానీ అక్కడికి మన భారతీయులకు ప్రవేశం లేదు కానీ విదేశీయులకి మాత్రం అనుమతి ఉంది. చూసారా మిత్రులారా భారతదేశం లో ఉండి కూడా భారతీయుల్ని కాకుండా విదేశీయులని పంపిస్తున్నారు. ఆ ప్రదేశాలు ఏంటో ఇపుడు మనం తెలుసుకుందాం.

 

onlinebadi

 

మనం ఏదైనా హోటల్ కి గాని రెస్టారెంట్ కి గాని వెళ్ళినపుడు హోటల్ సిబ్బంది రండి రండి అని గ్రాండ్ వెల్కమ్ చెబుతారు కానీ ఇపుడు మనం తెలుసుకోబోయే ప్రదేశాలకి వెళ్తే మనల్ని కనీసం గేట్ లోపలికి కూడా రానివ్వరు. అక్కడ ఇండియన్స్ కి అనుమతి లేదు అని బోర్డులు పెట్టి ఉంటాయి.

 

1.Uno – In హోటల్.

 

 

ఈ హోటల్ బెంగళూర్ లో ఉంది. ఇది nippan infrastructure తో కలిసి ఉంది.ఇది మన భారతదేశం లో ఉండి భారతీయులచే నిర్మించబడి కూడా మన భారతీయుల్ని లోపలి రానివ్వరు. ఈ హోటల్ ని 2012 లో కట్టించారు.ఇక్కడకి కేవలం జపాన్ వాళ్ళను మాత్రమే రానిస్తారు. ఎందుకంటే బెంగళూర్ లో జపాన్ వాళ్లకి సంబంధిచిన సాఫ్ట్ వేర్ కంపనీలు ఉన్నాయి.అందువల్ల జపాన్ వాళ్ళు తరుచు బెంగళూర్ కి వస్తూ ఉంటారు. అందుచేత జపాన్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ హోటల్ ని కట్టించుకున్నారు. ఈ హోటల్ లో కేవలం జపాన్ వాళ్లకి సంబంధించిన ఆహార పదార్థాలు మాత్రమే లభిస్తాయి.

 

2. Free kasol Cafe.

 

ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఇది చాల చిన్న రెస్టారెంట్. ఇది మన ఇండియాలోనే అతి సుందరమైన కసూల్ అనే ప్రదేశంలో ఉంది. ఇది ఒక ఇజ్రాయిల్ ఇండియన్ తో నడుపబడుతుంది. ఈ రెస్టారెంట్ లో మెనూకార్డు లో కానీ గోడలపైన కూడా కానీ ఎక్కడ కూడా ఇండియన్ భాషలు ఉండవు. ఇందులోకి కేవలం ఇజ్రాయిల్ టూరిస్టులను మాత్రమే పంపిస్తారు. కసూల్ లో అక్కడ ఉన్న కొండల వాళ్ళ చెట్ల వాళ్ళ చాలా స్వచ్ఛమైన గాలి వస్తుందని చాలా మంది వెళ్తారు. కానీ ఇండియన్ టూరిస్టులకు తెలీక ఈ రెస్టారెంట్ కి వెళదామని ప్రయత్నిస్తారు. అపుడు ఆ హోటల్ సిబ్బంది ఇండియన్స్ ని బయటికి పంపిస్తారు.

3. Goa Beaches.

 

Goa Beach

 

గోవా మనందరికీ తెలుసు. ఎవరైనా గోవా కి వెళ్లి బీచ్ లో ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. కానీ గోవా లో ఉన్న కొన్ని బీచ్ లకి మాత్రం ఇండియన్స్ కి ప్రవేశంలేదంట. ఎందుకంటే గోవాకి చాలా మంది విదేశీయులు వస్తుంటారు. అయితే ఆ విదేశీయుల వస్త్రాధారణము మన ఇండియా లో ఉన్నట్టుగా ఉండదు. ఒకప్పుడు ఆ విదేశీయులని చూడటానికి మాత్రమే మన వాళ్ళు వెళ్లేవారంట. అపుడు ఆ విదేశీయులు చాలా ఇబ్బంది పడేవాళ్ళంట. ఆ తర్వాత విదేశీయులు అందరు కలిసి గవర్నమెంటుకి వెళ్లి వీళ్ళ ఇబ్బందుల గురించి చెప్పి ప్రాధేయపడ్డారంట. అప్పటి నుండి కేవలం విదేశీయుల కోసం ప్రత్యేకంగా కొన్ని బీచ్ లను ఇచ్చారు. కావున గోవా లో ఉన్న కొన్ని బీచ్ లను మనము చూడలేము.

 

4. A Certain Lodge.

 

A Certain lodge

 

ఇది చెన్నయ్ లో ఉంది, ఈ భవనము చాలా పురాతనమైనది. అప్పట్లో ఇందులో నవాబులు ఉండేవారు. నవాబుల కాలం తర్వాత ఈ భవనంని హోటల్ గా వాడుతున్నారు. ఈ హోటల్ కి వెళ్లేముందు మీకు ఒక బోర్డు కనిపిస్తుంది. అది ఏంటంటే కుక్కలని మరియు ఇండియన్స్ ని ఇందులోకి అనుమతించబడదు అని ఉంటుంది. చూశారా మిత్రులారా బోర్డ్ ఎంత ఘోరంగా ఉందొ అందుకే ఇందులోకి కేవలం విదేశీయులని మాత్రమే పంపిస్తారంట. వారిని కూడా పాస్ పోర్ట్ లను చెక్ చేసి మరి పంపుతారంట.

 

5.Pondicherry beach.

 

pandicherry beach

 

కొన్ని వందల సంవత్సరాల క్రితం ఫ్రెంచ్ దేశం నుండి మన దేశానికి వచ్చిన ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ చాలా కట్టడాలు నిర్మించారు. అవి ఇప్పటికి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఇండియన్స్ మరియు ఫ్రెంచ్ అర్చిటెక్చర్స్ కలిసి నిర్మించారు. వీటిని ఇండియన్ మరియు ఫ్రెంచ్ సంస్కృతిని కలిపి నిర్మించారు. గోవా తరువాత ఎక్కువ బీచ్ లు ఉన్న ప్రదేశం పాండిచ్చేరి. విదేశీల వస్త్రధారణ కారణంగా మన ఇండియన్స్ ని కొన్ని బీచ్ లకి అనుమతించరు.

 

ఇలాంటివి ఇంకా చాలా ప్రదేశాలు మన ఇండియాలో ఉన్నాయి వాటి గురించి మనం ఇంకో ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ధన్యవాదములు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *