హృదయాన్ని కదిలించే ఒక విద్యార్థిని కథ.

హృదయాన్ని కదిలించే ఒక పేద విద్యార్థిని కథ.

 

student pics

 

క్లాస్ లో ఒక స్టూడెంట్ పెన్ పోయింది. ఎవరు దొంగలించారో తెలుసుకోవాలని, టీచర్ అందరి బ్యాగ్ లు తనిఖీ చేస్తుంది. క్లాస్ లో ఉన్న ఒక అమ్మాయి మాత్రం తనిఖీ కి ససేమిరా అంటుంది. టీచర్ ఎంత బలవంత పెట్టిన ఒప్పుకోవటం లేదు. క్లాస్ మొత్తం వినోదంగా చూస్తున్నారు. టీచర్ కి అర్ధం అయింది. ఈ అమ్మాయే పెన్ దొంగిలించింది అని ఇంతలో హెడ్ మిస్ట్ర్రేస్ వచ్చారు.క్లాస్ లో అందరి ముందు అవమాన పరచడం ఇష్టం లేక తన ఆఫీస్ రూమ్ కి తీసుకెళ్లారు. బ్యాగ్ తెరిచి చెక్ చేసిన టీచర్ అవాక్కయ్యారు. బ్యాగ్ లో సగం తిని వదిలేసిన తినుబండారాలు ఉన్నాయి. అవి చుసిన టీచర్ కోపం తో రగిలి పోయింది. ఇవన్నీ ఏంటి అని గద్దించింది . దానికి ఆ పాప చెప్పిన సమాధానం నిజంగా గుండెల్ని పిండేయక తప్పదు.

విద్యార్థిని సమాధానము ” మేము చాలా పేద వాళ్ళము మేమ్ తినడానికి కూడ గతి లేని వాళ్ళము. అందుకే క్లాస్ లో స్టూడెంట్స్ తినలేక డస్ట్ బిన్ లో పారబోసిన తినుబండారాలను కలెక్ట్ చేసి రోజూ మా ఇంటికి తీసుకెళ్తాను. ఇంట్లో మా వాళ్ళకి ఇదే ఆధారం మేమ్ వాళ్ళకి ఇవి తింటే కొంతైనా కడుపు నిండుతుంది. నేను దొంగతనం చేయను మేమ్ వ్యర్తముగా పారేసినవి తీసుకుంటాను అని చెప్పింది.” ఈ మాటలతో హెడ్ మిస్ట్ర్రేస్ కళ్ళలో నీళ్లు తిరిగాయి.

కాస్త ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక వైపు తిండి లేక అల్లాడుతున్న జనం, ఒక వైపు తిండి ఎక్కువై డస్ట్ బిన్ లో పారబోస్తున్న జనం. ఎప్పుడైనా వంటకాలు మిగిలితే పారబోయకుండా పంచిపెట్టండి. పిల్లలకు టిఫిన్ బాక్స్ పెట్టి అందరితో పంచుకు తినమని చెప్పండి. పారబోసే అలవాటు ఉంటే మానేయమని చెప్పండి.

“అన్నం పరబ్రహ్మ స్వరూపం, వ్యర్థం చేయకండి. వీలైతే ఇంకొకరి కడుపు నింపి పర బ్రహ్మ ని గౌరవించాలని ఆశిస్తూ మీ ఆన్ లైన్ బడి”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *